Pacha Karpuram : పచ్చ కర్పూరంతో ఇలా చేస్తే.. డబ్బే డబ్బు.. ధన ప్రవాహమే..!
Pacha Karpuram : పచ్చ కర్పూరంతో ఇలా చేస్తే.. డబ్బే డబ్బు.. ధన ప్రవాహమే..!
Pacha
Karpuram : మనలో చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. కొందరికి అసలు
డబ్బు చేతిలో నిలవదు. ఇంకొందరు డబ్బును సంపాదించలేకపోతుంటారు.
అలాగే
కొందరికి డబ్బు వచ్చినా.. విపరీతంగా ఖర్చవుతుంటుంది. దీంతో వారు ఆర్థిక
సమస్యల్లో చిక్కుకుంటుంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై లేనంత వరకు
మనం ఏమీ చేయలేం. ఆమె అనుగ్రహం ఉంటేనే మనం డబ్బు సంపాఇంచగలం. అలాగే ఆర్థిక
సమస్యలు ఉండవు. అయితే ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు
కలుగుతుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీదేవికి
అత్యంత ప్రీతిపాత్రమైన వాటిల్లో పచ్చ కర్పూరం ఒకటి. దీన్ని వాడడం వల్ల
మనకు కలిగే అన్ని ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ధనం బాగా సంపాదిస్తారు. ఇక
ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే.. పచ్చ కర్పూరాన్ని మనం ఎలా ఉపయోగించాలంటే..
ఒక పాత్రలో నీటిని పోసి అందులో పచ్చ కర్పూరం, పసుపును వేసి లక్ష్మీదేవి
ఎదుట ఉంచాలి. ఇలా రెండు రోజుల పాటు ఉంచాక పాత్రను శుభ్రం చేసి మళ్లీ అలాగే
వాటిని వేసి పెట్టాలి. ఇలా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు
చెబుతున్నారు.
Pacha Karpuram
అలాగే
పచ్చ కర్పూరాన్ని ఒక పసుపు వస్త్రంలో వేసి మూటలా కట్టాలి. అనంతరం దాన్ని
ఇంట్లో ఉత్తర దిక్కున ఉంచాలి. ఇది కుబేర స్థానం. కనుక మనకు ధనం బాగా
లభిస్తుంది. ఇలా తరచూ చేస్తుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పచ్చ
కర్పూరాన్ని ఇదే విధంగా పసుపు వస్త్రంలో వేసి మూటలా కట్టి దాన్ని ఇంటి
ప్రధాన ద్వారం వద్ద కట్టాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న అందరికీ మానసిక
ప్రశాంతత లభిస్తుంది. వారు ఎదుర్కొనే సమస్యలు తగ్గుతాయి. ఇక పచ్చ
కర్పూరాన్ని పేపర్‌లో చుట్టి పర్సులో పెట్టుకోవాలి. దీంతో ధనం బాగా
సంపాదిస్తారు. ఇలా పచ్చ కర్పూరం వల్ల మనకు ఉండే ఆర్థిక సమస్యలను
తొలగించుకుని డబ్బును బాగా సంపాదించవచ్చు.

Comments
Post a Comment