మహాభారతం ప్రకారం మీ రహస్యాలను ఎవరితో చెప్పకూడదు ఎందుకంటే? జీవితంలోని ప్రతి మలుపులోను మహాభారతం అందరికీ స్పూర్తిదాయకంగా, ఆదర్శంగా ఉంటుంది. ఈ మహాభారత ఇతిహాసంలో ఉపదేశించిన పరిస్థితులు, సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకరోజున, ఏదో ఒక రూపాన తారసపడుతూనే ఉంటాయి. ప్రజల మనస్థితి, ఒకరిని అర్ధం చేసుకునే విధానం, ఎదుటి వ్యక్తిని అంచనా వేయడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి అనేక విషయాలలో మహాభారతం ఎందరికో ఆదర్శప్రాయం. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న మహాభారతంలో సుమారుగా 100,000 శ్లోకాలను కలిగి ఉండి అతిపెద్ద ఇతిహాసంగా చెప్పబడుతుంది. క్రమంగా 100,000 కన్నా అధికంగా సూచనలను కలిగి ఉంటుంది. కానీ వీటిలోని అంతరార్ధాన్ని లోతుగా పరిశీలించగలిగే వారు మాత్రం తక్కువ. అలా ఒక శ్లోకం గురించి వివరాలలోకి వెళ్తే, మీ రహస్యాలను ఎవరితో చెప్పకూడదు అన్న ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. అదేమిటో చూద్దాం. శ్లోకం : స్త్రీయం ముదేన్ బాలెన్ లబ్దేన్ లఘుపని వా ! న మంత్రాయిత్ గుహ్యాని యేషు చోన్మాడ్ లక్షణం !! అర్ధం : ఈ శ్లోకంలో ప్రధానంగా ఆరుమంది వ్యక్తుల గురించి వివరించడం జరిగింది. ఈ ఆరుమంది వ్యక్తులతో మన రహస్యాలను పంచుకోరాదు అని ...