కృష్ణ మంత్రాలు- మంత్రాల అర్థాలు అలాగే జపించడం వలన కలిగే లాభాలు
కృష్ణ మంత్రాలు- మంత్రాల అర్థాలు అలాగే జపించడం వలన కలిగే లాభాలు శ్రీమహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుని అవతారము. భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు సమస్త మానవాళికి గొప్ప సందేశాన్ని అందించాడు. నిజానికి, భగవద్గీతలో కృష్ణుని బోధనలను ఇప్పటి విద్యార్థులకు అలాగే ఉద్యోగులకు మోటివేషనల్ స్పీచెస్ లో వివరిస్తున్నారు కూడా. అంతటి ప్రాధాన్యత కలిగినవి శ్రీకృష్ణుని బోధనలు. మానవాళిని అన్నిరకాల బాధల నుంచి రక్షించేవాడని శ్రీకృష్ణుడిని కొలుస్తారు. ఈ రోజు ఈ ఆర్టికల్ లో శ్రీకృష్ణుని మంత్రాలూ వాటి అర్థాలు. వాటిని జపించడం వలన కలిగే లాభాలను తెలుసుకుందాం. శ్రీకృష్ణుని మహామంత్రము హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అర్థం: ఈ మంత్రంలో శ్రీమహావిష్ణువు అవతారలైన శ్రీరాముడిని అలాగే శ్రీకృష్ణుడిని స్తుతించడం జరిగింది. మానవాళికి విముక్తిని ప్రసాదించే శ్రీ వాసుదేవునికి నమస్కారాలను తెలియచేయుచున్నాము. కృష్ణ భక్తి మంత్రం "జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభూ నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసడై గౌర్ భక్తా వృంద" అర్థం: ఈ మంత్రంలో శ్రీకృష్ణుడి గొప్ప ...